ideal |వయసుని జయించి.. ఓటు వేసి చైతన్యాన్ని చాటిన రిటైర్డ్ సింగరేణి కార్మికుడు

ideal |వయసుని జయించి.. ఓటు వేసి చైతన్యాన్ని చాటిన రిటైర్డ్ సింగరేణి కార్మికుడు
ideal |బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: ఓటు మన ఆయుధం.. అది ప్రతి ఒక్కరి బాధ్యత” అని చాటిచెప్పారు ఒక వృద్ధ ఓటరు. బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పట్టణంలోని టేకులబస్తీకి చెందిన 84 ఏళ్ల వృద్ధుడు, రిటైర్డ్ సింగరేణి కార్మికుడు పులియాల రాయమల్లు అందరికీ ఆదర్శంగా నిలిచారు. బుధవారం పట్టణంలోని బజార్ ఏరియా పాఠశాలలో ఏర్పాటు చేసిన 29వ నంబర్ పోలింగ్ కేంద్రంలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
వయోభారంతో నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ, ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనాలనే సంకల్పంతో కుటుంబ సభ్యుల సహాయంతో వీల్ చైర్‌లో పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “సింగరేణిలో దశాబ్దాల కాలం కష్టపడి పనిచేశానని, సమాజం బాగుండాలంటే మంచి నాయకులను ఎన్నుకోవాలని, అందుకే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఓటు వేయడానికి వచ్చానని” ఉత్సాహంగా తెలిపారు. ఓటు వేయడానికి యువత వెనుకాడుతున్న ఈ రోజుల్లో, 84 ఏళ్ల వయసులో రాయమల్లు చూపిన చైతన్యాన్ని చూసి అక్కడి అధికారులు, ఇతర ఓటర్లు ఆయన్ని అభినందించారు.
