ICC | గిల్ కు ఐసిసి అవార్డ్.. యువ బ్యాట‌ర్ న‌యా రికార్డు !

టీమిండియా యువ బ్యాట్స్‌మన్, స్టార్ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ ఐసిసి నుండి ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ఈరోజు ఫిబ్రవరి నెల‌కు ‘‘ఐసిసి పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్‌’ను ప్రకటించింది. ఐసిసి ప్రకటించిన ఫిబ్రవరి నెలలో ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గిల్ గెలుచుకున్నాడు.

గిల్ తో పాటు, ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్, న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ కూడా ఫిబ్రవరి నెల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం పోటీ పడ్డారు. అయితే, గిల్ అత్యధిక ఓట్లతో అవార్డును గెలుచుకున్నాడు.

దీంతో అత్యధికసార్లు ఈ అవార్డును అందుకున్న భారత క్రికెటర్‌గా గిల్ రికార్డు సృష్టించాడు. గిల్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకోవడం ఇది మూడోసారి. గిల్ ఈ అవార్డును 2023 జనవరి, సెప్టెంబర్ అందుకున్నాడు.

ఫిబ్రవరిలో దుమ్మురేపిన‌ గిల్..

ఫిబ్ర‌వ‌రిలో ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను టీమ్ ఇండియా 3-0తో క్లీన్ స్వీప్ చేయడంలో గిల్ కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో శుభ్‌మాన్ గిల్ ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలతో సహా 259 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా గిల్ మంచి ప్రదర్శన ఇచ్చాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై గిల్ 46 పరుగులు, బంగ్లాదేశ్‌పై సెంచరీ చేశాడు.

ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డులను అందుకున్న భారత ప్లేయ‌ర్లు వీరే..

  • శుబ్‌మన్‌ గిల్ – మూడుసార్లు
  • జస్‌ప్రీత్‌ బుమ్రా – రెండుసార్లు
  • రిషభ్‌ పంత్ – ఒకసారి
  • రవిచంద్రన్‌ అశ్విన్ – ఒకసారి
  • భువనేశ్వర్‌ కుమార్ – ఒకసారి
  • శ్రేయస్‌ అయ్యర్ – ఒకసారి
  • విరాట్‌ కోహ్లి – ఒకసారి
  • య‌శస్వి జైస్వాల్ – ఒకసారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *