iBOMMA | రవి అరెస్ట్ తో పైరసీ కనుమరుగేనా..

iBOMMA | రవి అరెస్ట్ తో పైరసీ కనుమరుగేనా..

  • అలాంటి వెబ్ సైట్ లెన్నో..
  • సినిమాలు రిలీజైన క్షణాల్లోనే వాటిలో ప్రత్యక్షం..
  • ఎదురు చూసేవాళ్ళు కోకొల్లలు..
  • డౌన్ లోడ్ చేసుకోవడం చూసేయడం..

iBOMMA |వెబ్ డెస్క్ ఆంధ్రప్రభ : సినిమాల్లో దొంగతనం, హ్యాకింగ్, చట్టవిరుద్ధమైన పనులను కూడా సామాజిక ప్రయోజనం కోసం చేస్తున్న‌ట్టుగా చూపించి.. ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించే హీరోయిజం… అయితే, నిజ జీవితంలో చట్టాన్ని ఉల్లంఘిస్తే జైలు త‌లుపులే తెరుచుకుంటాయని ఇభొమ్మ పైరసీ సైట్ వ్యవస్థాపకుడు ఇమ్మిడి రవి ఉదంతం నిరూపించింది. ఇమ్మిడి రవిని విచారించిన పోలీసులు కీల‌క విష‌యాలు క‌నుక్కున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నావ్ అయ్యా అని అడిగితే.. కేవ‌లం కిక్కు కోసం… నాకు అలా చేయడం నచ్చింది అని స‌మాధానం ఇచ్చాడంట ర‌వి.

iBOMMA | సరదాగా మొదలై…


అది ఒకే.. మ‌రి పులువురు ప్ర‌ముఖుల డేటా ఎందుకు క‌లక్ట్ చేశావు..? అని అడిగితే… జ‌స్ట్ నేను అది కూడా చేయ‌గ‌ల‌ను అని నిరూపించ‌డానికే చేశాను త‌ప్ప, నాకు ఇంకో ఉద్దేశ్యం లేదు అని చెప్పాడట‌. రవికి, చిన్నప్పటి నుండి.. ఏ సినిమా విడుదలైనా వెంట‌నే చూడాలి అనే క్రేజ్ ఉండేది. ఈ క్రేజ్ క్రమంగా వ్యసనంగా మారింది. యూట్యూబ్ వీడియోల ద్వారా హ్యాకింగ్ నేర్చుకున్న రవి, సినిమా థియేటర్లు, ఓట్ట్ సర్వర్‌లను హ్యాక్ చేసి సినిమా ప్రింట్‌లను దొంగిలించేవాడట. అలా హ్యాక్ చేసిన ప్రింట్ల‌ను టెలిగ్రామ్ ఛానెల్స్ కు అమ్మే వాడట ర‌వి. అలా తాను సంపాదించిన డబ్బు కూడా ఖర్చు చేయకుండా, కేవలం కిక్కు కోసమే ఈ పని చేసినట్టు పోలీసుల విచార‌ణలో తేలింది.

iBOMMA | అలా మొదలైందే ఐబొమ్మ


చివరికి, అతను ఐబొమ్మ అనే పైరసీ సైట్‌ను క్రియేట్ చేసి, అందులో కొత్త సినిమాలను అప్‌లోడ్ చేయడం ప్రారంభించాడు. ప్రజలకు ఇది ఫ్రీ మూవీగా అందుబాటులో వచ్చింది. అయితే.. సినీ పరిశ్ర‌మ‌ పై ఈ పైర‌సీ బూతం ప్ర‌భావం ఉన్న అంత‌గా ప‌ట్టించుకోలేదు. ఆఖరికి ఈ పైర‌సీ కార‌ణంగా చిత్ర ప‌రిశ్ర‌మ‌కు వంద‌ల కోట్ల నష్టం వచ్చింది. అయితే.. ఇది చూస్తుంటే… మాస్ మహారాజా రవితేజ కిక్కు సినిమానే గుర్తు వ‌స్తుంది. అందులో హీరో.. ర‌వితేజ కిక్కు కోసం క‌ర‌ప్టెడ్ అధికార‌ల వ‌ద్ద డ‌బ్బులు దొంగ‌లించి.. అవ‌స‌రం ఉన్న వాళ్ల‌కి ఇచ్చేస్తుంటాడు… ఇక్క‌డ ర‌వి చేసింది కూడా ఒక ర‌కంగా అలాగే ఉందని సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌ జరుగుతుంది.

iBOMMA | అలా అని ఫ్రీగా చూపించేస్తే ఎలా..


ఎందుకంటే.. సినిమా మేకింగ్ కి ఇంత బ‌డ్జెట్ అవుతుంది.. అందుకే టికెట్ రేట్లు పెంచుతున్నామని.. సినీ అభిమానుల జేబులు గుల్ల చేస్తున్నారు మూవీ మేక‌ర్స్. ఈ క్ర‌మంలో ర‌వి తెచ్చిన ఐబొమ్మ‌తో ఫ్రీగా సినిమ చూసే వెసులుబాటు క‌లిగింది. సినిమా టికెట్ రేట్లు అంత‌గా పెంచుకుంటూ పోతే ఇలాగే అవ్వుద్ది అని సొష‌ల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు. అయితే.. కిక్కు కోసం సినిమాలో ర‌వితేజ దొంగ‌త‌నాలు చేస్తే హీరో అయ్యాడు.. కానీ రియ‌ల్ లైఫ్ లో కిక్కు కోసం సినిమాల‌ని పైర‌సీ చేసిన ర‌వి పోలీసుల ముందు క్రిమిన‌ల్ గా నిల్చున్నాడు.

సినిమాల్లో ఉన్న‌ట్టు.. రియ‌ల్ లైఫ్ లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లేదా హైపర్ యాంగిల్స్ ఉండవు… ఇక్కడ చట్టం మాత్రమే ఉంటుంది. పైరసీతో చిత్ర పరిశ్రమకు వంద‌ల కోట్ల‌ నష్టం కలిగించిన ఇమ్మిడి రవిని చివరికి హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమాల్లో దొంగతనాలు చేసి హీరోలు అవ్వ‌చ్చు ఏమో కానీ… అదే పనిని నిజ జీవితంలో చేస్తే మాత్రం చట్టం ముందు “విలన్” గా మిగిలాల్సి వస్తుంది అనేది ఈ ఉదంతం స్పష్టం చేసింది.

iBOMMA | ఇంతటితో ఆగేనా…


ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు బాగానే ఉంది. దీంతో పైరసీ తగ్గుతుందా..? ఇండస్ట్రీకి మేలు జరుగుతుందా..? అంటే.. అవునని ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే.. ఐబొమ్మ ఒక్కటే కాదు.. ఇలాంటివి ఫ్రీగా సినిమాలు చూపించేవి చాలా వెబ్ సైట్స్ ఉన్నాయి. మరి.. పరిష్కారం ఏంటంటే.. ఇలాంటి విలన్ వేషాలు వేసే వాళ్లను కఠినంగా శిక్షించాలి. మళ్లీ ఇలాంటి పనులు చేయాలంటే.. వెన్నులో వణుకు పుట్టాలి. అలాంటి చట్టాలు రావాలి. అలాగే ఇండస్ట్రీ అంతా ఏకమవ్వాలి.. ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలి.. కొత్త చట్టాలు ఏర్పాటు చేయాలి. అలా చేస్తేనే.. పైరసీని.. ఐబొమ్మ రవి లాంటి వాళ్లను అరికట్టగలం. అలా కాకుండా.. మా సినిమా రిలీజ్ అయినప్పుడు చూసుకుందామని ఇండస్ట్రీలో ఎవరికివారు అనుకుంటే.. ఈ సమస్య ఇలాగే ఉంటుంది. సినీ పరిశ్ర ముందుకు వస్తే.. ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. మరి.. ఈ రెండు కలిసి ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కారం అయ్యే చర్యలు తీసుకుంటాయేమో చూడాలి.

ఇది కూడా చదవండి.. నాన్న మాట ఇన్నాళ్ళకు విన్నాను!

Leave a Reply