హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress)లో కొంత కాలంగా సొంత పార్టీ, ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Komatireddy Rajagopal Reddy) ఈ రోజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ(Assembly)కి మళ్లీ రానని మీడియాకు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తన మద్దతు దారులతో గన్ పార్క్ వద్దకు చేరుకున్న రాజగోపాల్ రెడ్డి అక్కడ మీడియాతో మాట్లాడారు. రోజు అసెంబ్లీ తర్వాత మళ్లీ అసెంబ్లీకీ రానని చెప్పారు. ప్రజలు వరద కష్టాల్లో ఉన్నారని వారికి అండగా ఉండాల్సిన సమయం ఇది అన్నారు.
కామారెడ్డి బాధితులకు అండ
కామారెడ్డి (Kamareddy) ప్రాంతంలో వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తన అనుచరులతో పాటు ఆ ప్రాంతాల్లో పర్యటించి వారికి అండగా ఉంటానని చెప్పారు. అమరవీరుల త్యాగాలతోనే తెలంగాణ ఏర్పాటు అయిందని అమరవీరుల స్థూపం (Martyrs’ Monument) అంటే తమకు గుడితో సమానం అన్నారు. అమరవీరుల స్తూపం వద్దకు రావడానికి ప్రత్యేక కారణం ఏమీ లేదని స్పష్టం చేశారు.