- సర్పంచ్ అభ్యర్థి కుమ్ర యశోద కేశవరావు
జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని గూడమామడ గ్రామ సర్పంచ్ పదవికి అవకాశం ఇస్తే పంచాయతీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి కుమ్ర యశోద కేశవరావు తెలిపారు. గత సర్పంచ్ ఎన్నికల్లో తన భర్త కేశవరావును ప్రజలు ఆదరించి గెలిపించారని, ఆయన గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేసి మంచి పేరు తెచ్చుకున్నారని ఆమె తెలిపారు. ఈసారి మహిళా రిజర్వేషన్ రావడంతో విద్యావంతురాలైన తాను సర్పంచ్ బరిలో దిగినట్లు పేర్కొన్నారు.
తన కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే పంచాయతీ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానని యశోద హామీ ఇచ్చారు. భర్త సర్పంచ్‌గా ఉన్న అనుభవం, ఆయన అండదండలతో గ్రామ అభివృద్ధికి పనిచేస్తానని చెప్పారు. ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని ఆమె కోరారు.

