హైదరాబాద్ – కూకట్ పల్లి నియోజకవర్గంలోని గ్రావిటీ హోటల్ నందు తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ క్రియా వాలంటీర్స్ తో జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ టిటిడి బోర్డు మెంబర్ మహేందర్ రెడ్డి , తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ , ఖమ్మం నియోజకవర్గం ఇంచార్జ్ రామకృష్ణ వీర మహిళా నాయకురాలు కావ్య ,శిరీష ,నిహారిక సభ్యత్వం నమోదు చేయించిన వాలంటరీలను శాలువాలతో సన్మానించారు.
ఈ సందర్భంగా నేమూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ క్రియాశీలక సభ్యత్వ ఐడి కార్డులను , అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లెటర్ ద్వారా పంపించిన ప్రత్యేక సందేశ పత్రంను ప్రతి ఒక్క జన సైనికుడికి ,వీర మహిళలకు పది రోజులలో గౌరవంగా అందించాలని సూచించారు. కాగా, ఇప్పటి వరకు ప్రమాదవశాత్తు తెలంగాణ రాష్ట్రంలో మరణించిన, గాయపడిన జన శ్రేణులకు సుమారు కోటి మూడున్నర లక్షలు బీమా సొమ్ములను జనసేన పార్టీ అందించినట్లు చెప్పారు. జనసేన పార్టీ జన సైనికులకు ఇచ్చే బీమా భరోసా పద్ధతిని చూసి ఇతర పార్టీలు కూడ అనుసరిస్తున్నాయని అన్నారు. , రాబోయే రోజులలొ ప్రతి గ్రామం, జిల్లాలలో , గ్రేటర్ హైదరాబాద్ లొ బలోపేతం చేయాలని నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర జనసేన నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు.