HYD | రిజ‌ల్ట్ ఏం వ‌చ్చిందంటే..!

HYD | రిజ‌ల్ట్ ఏం వ‌చ్చిందంటే..!

HYD | ఆంధ్రప్రభ, వెబె డెస్క్ : హైదరాబాద్‌లోని కొండాపూర్ ప్రాంతంలో ఉన్న క్వాక్ ఏరీనా పబ్‌లో డ్రగ్స్ కలకలం రేగింది. ముందస్తు సమాచారంతో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించగా, పలువురిలో మత్తు పదార్థాల వినియోగం వెలుగులోకి వచ్చింది.

డ్రగ్స్ పరీక్షల్లో షాకింగ్ నిజాలు

పబ్‌లో నిబంధనలకు విరుద్ధంగా డ్రగ్స్ వినియోగం జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న సుమారు 64 మందికి డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మొత్తం ఎనిమిది మందికి మత్తు పదార్థాలు సేవించినట్లు తేలింది. వీరిలో ఆరుగురికి గంజాయి పాజిటివ్‌గా తేలగా, మరో ఇద్దరికి ఇతర డ్రగ్స్ వినియోగించినట్లు నిర్ధారణ అయ్యింది.

నటి హేమ స్పందన..

ఈ ఘటనపై నగరవ్యాప్తంగా చర్చ జరుగుతుండగా, టాలీవుడ్ సీనియర్ నటి హేమ పేరు కూడా వెలుగులోకి వచ్చింది. తాను కూడా ఆ సమయంలో పబ్‌లో ఉన్నట్లు ఆమె ధృవీకరించారు. అయితే, తనకు నిర్వహించిన డ్రగ్స్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చినట్లు వీడియో ద్వారా స్పష్టం చేశారు. అనవసర ప్రచారాలను నమ్మవద్దని కోరుతూ, పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, పోలీసులు పబ్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply