- సుమోటోగా కేసు నమోదు…
 
చేవెళ్ల బస్సు దుర్ఘటనపై ఇప్పుడు జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) దృష్టి పెట్టింది. అనేక కుటుంబాలను శోకసముద్రంలో ముంచిన ఈ ప్రమాదంపై కమిషన్ స్వయంగా సుమోటో కేసు నమోదు చేసింది.
డిసెంబర్ 15వ తేదీ ఉదయం 11 గంటలలోపు సమగ్ర నివేదికను సమర్పించాలని కమిషన్ రవాణా, హోం, గనులు & భూగర్భశాస్త్రం శాఖలు, ఎన్‌హెచ్‌ఏఐ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, టీజీ ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
కాగా, సోమవారం తెల్లవారుజామున తాండూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఆర్టీసీ బస్సు, చేవెళ్ల మండలం మిర్జాగూడ వద్ద లారీని ఢీకొనడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లారీలో ఉన్న కంకర బస్సుపై కుప్పగా పడటంతో, 19 మంది అక్కడికక్కడే మృతి చెందగా, 34 మంది గాయపడ్డారు. వారిని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు.

