WGL | విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం

కరీమాబాద్, జూన్ 5 (ఆంధ్రప్రభ ) : వరంగల్ నగరంలోని 34వ‌ డివిజన్ శివానగర్ రుద్రమాంబ నగర్ లో ఒక ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావ‌డంతో ఇంట్లోని వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. 34వ‌ డివిజన్ శివానగర్ విఘ్నేశ్వర పరుపతి సంఘం ఎదురు గల్లీలో గురువారం ఉదయం వేటూరి దేవేందర్ చారి ఇల్లు షార్ట్ సర్క్యూట్ వలన ఇల్లు కాలడం జరిగినదని స్థానికులు బజ్జూరి అంజయ్య తెలిపారు.

ఉదయం 5గంటలకు కుటుంబ సభ్యులు ఊరు వెళ్తున్న క్రమంలో వారింటికి తాళం వేసుకొని వెళ్లిపోయిన అనంతరం ఇంట్లో నుండి మంటలు రావడంతో చుట్టుపక్కల వారు గమనించి నీళ్లతో మంటలను ఆర్పి వేస్తూ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారని తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, మిల్స్ కాలనీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఇంట్లోని వస్తువులు, ఫర్నిచర్ పూర్తిగా కాలిపోయాయి. సుమారు రెండు లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply