Hospital | చెట్టుకొమ్మలు తొలగించాలి

Hospital | చెట్టుకొమ్మలు తొలగించాలి
Hospital | గుడిహత్నూర్, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని స్థానిక వెటర్నరీ హాస్పిటల్(Veterinary Hospital) మైదానంలో ఉన్న చెట్టు కొమ్మలు ప్రమాదకరంగా మారాయి. చెట్టు కొమ్మలకు అతి సమీపంలో విద్యుత్ తీగలు ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరగుతుందో తెలియడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ మైదానంలో ప్రతిరోజూ చిన్నారులు ఆటలు ఆడుతుండటంతో విద్యుత్ ప్రమాదాలు(electrical accidents) జరిగే అవకాశం ఉందని వారు తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చెట్టు కొమ్మలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
