రెండు ఆర్టీసీ బస్సులు.. ఇసుక ట్రాక్టర్ ఢీ..

రెండు ఆర్టీసీ బస్సులు.. ఇసుక ట్రాక్టర్ ఢీ..

23 మందికి గాయాలు
6 గురి పరిస్థితి విషమం


(పుంగనూరు, ఆంధ్రప్రభ) : చిత్తూరు జిల్లా (Chittoor District) పుంగనూరు పట్టణం గూడూరుపల్లిలో మంగళవారం ఉదయం రెండు ఆర్టీసీ బస్సులు ఇసుక ట్రాక్టర్ ఢీకొనగా 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆరుగురు పరిస్థితి విషమంగా ఉంది. గూడూరుపల్లి వద్ద ఉదయం 9 గంటల ప్రాంతంలో ఎదురు ఎదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు, ఇసుక లోడ్ తో వెళుతున్న ఓ ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 23 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

క్షతగాత్రులను 108 వాహనం ద్వారా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా గాయపడిన వారిలో 6 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా(Tirupati Ruia) కు తీసుకువెళ్లాలని సూచించినట్లు వైద్యులు తెలిపారు. కాగా పుంగనూరు ఏరియా ఆసుపత్రి వద్ద క్షతగాత్రుల అరుపులతో దద్దరిల్లుతున్నది. ప్రమాద ఘటన తెలిసిన గాయపడిన వారి బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకోవడంతో ఏరియా ఆసుపత్రి రద్దీగా మారింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Leave a Reply