Hormuz | చిక్కుకున్న నౌకలకు కదలికలు ప్రారంభం

Hormuz | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య హర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన భారత నౌకలపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ తీసుకున్న తాజా నిర్ణయంతో భారత్‌కు భారీ ఉపశమనం లభించింది.

హర్మూజ్ జలసంధి వద్ద నిలిచిపోయిన 22 భారత నౌకలకు మార్గం సుగమమవుతోంది. అమెరికా మిత్రదేశాలకు చెందిన నౌకలకు అనుమతి ఇవ్వాలని ఇరాన్ నిర్ణయించిన నేపథ్యంలో, భారత నౌకల రాకపోకలకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం.

ఈ పరిణామంతో ఇంతకాలం అక్కడే నిలిచిపోయిన భారత నౌకలు త్వరలోనే తమ గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఏర్పడింది. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల కారణంగా హర్మూజ్ జలసంధి వద్ద కఠిన నియంత్రణలు అమలులో ఉండటంతో నౌకల రాకపోకలు నిలిచిపోయాయి.

ఇరాన్ తాజా నిర్ణయంతో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చర్య భారత్‌కు మాత్రమే కాకుండా అంతర్జాతీయ వాణిజ్యానికి కూడా ఉపశమనం కలిగించేలా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత ప్రభుత్వం కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తూ, నౌకల భద్రతపై అవసరమైన చర్యలు తీసుకుంటోంది.

Leave a Reply