Hormuz Crisis : హూ ఈజ్ బిగ్ బాస్ Andhra Prabha SPL Story

Hormuz Crisis : హూ ఈజ్ బిగ్ బాస్ Andhra Prabha SPL Storya
- అమెరికా పీచే ముడ్
- కౌన్ బనేగా హార్ముజ్ నాయక్
- తెరమీదకు భారత్
- ‘నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్’ చాన్స్
- ఇరానీ ఆధిపత్యంపై గల్ఫ్ వ్యతిరేకం
- అమెరికా స్థానంలో.. కొత్త లీడర్ కోసం..
- ఆసియ దేశాల అంతర్మథనం
( ఆంధ్రప్రభ, న్యూయార్క్ ప్రతినిధి)

ఇరాన్ పై ఆపరేషన్ ఎథిక్ ఫ్యూరీకి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాత్కాలిక. తెర దించారు. ఇరాన్ శకం ఇక ముగిసినట్టే అని ఆయన ప్రకటించారు. ఇరాన్ పంచప్రాణాలనూ నిర్వీర్యం చేసినట్టువివరించారు. ఇక ఇరాన్ విజయగర్వంతో చిందులు వేస్తోంది. ఈ తరుణంలో ప్రపంచాన్ని సమాధానం దొరకని ఓ పెద్దప్రశ్న వేధిస్తోంది.

ఫిబ్రవరి 28న టెహ్రాన్ పై విమానాల్లో దూసుకు వచ్చిన అమెరికా, ఇజ్రాయెల్ దళాలు.. ఇరాన్ చీఫ్ సుప్రీం అయతుల్లా ఖమేనీ సహా 40 మందిని హతమార్చిన కొన్ని గంటల్లోనే ఇరాన్ తీవ్రంగా స్పందింది, ప్రాణభయంతో ఇరాన్ ప్రజలు తమ ముందు ప్రణమిల్లుతారని అమెరికా, ఇజ్రాయెల్ వీరగర్వం ప్రదర్శిచాయి. వెనుజులాను లొంగదీసుకున్నట్లే ఇరాన్ భరతంఈ పట్టినట్టు అమెరికా జబ్బలు చరుకుంది. కానీ.. ఈ సీన్ మారిపోయింది. తమ సొరంగాల్లోని అణ్వాయుధం కంటే.. అత్యంత బలశాలి హార్ముజ్ జలసంధిని ఇరాన్ ప్రయోగించింది. ఈ దారిలో వచ్చే ఓడల్ని నిర్మొహమాటంగా ధ్వంపం చేస్తామని ప్రతిజ్ఙ చేసింది. అంతే ప్రపంచ దేశాలన్నీ బిక్కచచ్చిపోయాయి. అమెరికా కూడా ఎక్కడ తగ్గలేదు. హార్ముజ జలసంధిని స్వాధీనం చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. నాటో దేశాలను సాయం కోరింది. ప్చ్.. పని జరగలేదు.

భారీ స్థాయిలో సైనిక బలగాలను హార్ముజ్ వైపు సాగనంపింది కానీ ఏమి జరిగిందో,, అమెరికా అధ్యక్షుడు అకస్మాత్తుగా వెనకడుగు వేశారు. హార్ముజ్ జలసంధితో తమకు అవసరం లేదని .. మీరు మీరు చూసుకోండి అని కాడి కిందకు పడేశారు. ఈ విషయాన్ని పక్కన పెడితే.. తాజా పరిణామాల్లో హార్ముజ్ జలసంధిలో వివిధ దేశాల వాణిజ్య నౌకల రాకపోకల సంగతేంటీ? ఇక ఇరాన్ అనుమతితోనే ప్రపంచ దేశాలన్నీ తమ నౌకలను హార్ముజ్ మీదుగా నడపాలా? ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలా? కింకర్తవ్యం. ఇదీ ప్రపంచ దేశాల మెదడును తొలిచేస్తున్న ఆన్సర్ లేని క్వశ్చిన్.
Hormuz Crisis : అమెరికా వ్యూహం ఏమిటీ?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? “అమెరికా ఫస్ట్” (America First) విధానం బురఖా పైకి కనిపిస్తున్నా.. అంతర్లీనంగా మూడు ప్రధాన కారణాలు కనిప్తున్నాయి.

ఒకప్పుడు చమురు కోసం అమెరికా మధ్యప్రాచ్యంపై ఆధారపడేది. కానీ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా అమెరికా ఎదిగింది. తమకు అవసరం లేని చమురు మార్గాలను రక్షించడానికి అమెరికా సైనికులను, డబ్బును ఖర్చు చేయడం అనవసరమని ఆలస్యంగా ట్రంప్ గ్రహించారు. హార్ముజ్ జలసంధిలో నౌకల రక్షణ కోసం అమెరికా ఏటా బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తోంది. “మాకు సంబంధం లేని చమురును కాపాడటానికి మేము ఎందుకు ఖర్చు భరించాలి, అన్నది ట్రంప్ ప్రశ్న.

చమురు దిగుమతి చేసుకునే చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా తమ రక్షణ బాధ్యతలను తామే చూసుకోవాలని భావించి, అమెరికా సాయం కోరితే అందుకు తగిన రుసుము వసూలు చేయాలనేది ట్రంప్ వ్యూహం. ఈ దేశాలఉ అమెరికా సాయం కోరే అవకాశమే లేదు. ఎందుకంటే.. నేరుగా ఇరాన్ తో సంప్రదింపులు జరుపతున్నాయి.
Hormuz Crisis :ఇరాన్ ‘చెర’ తప్పినట్టేనా?

అమెరికా తప్పుకోవడంతో ఆసియా దేశాలకు లాభం కరెక్టే. కానీ ఇరాన్ పోకడలనే నమ్మటమే మహా కష్టం. మత ఛాందస వాద దేశంగా పేరొందిన ఇరాక్… ప్రపంచ దేశాలతో సఖ్యత ఎంత వరకూ కొనసాగుతుందో.. ఇదే మరో ప్రశ్న. అమెరికా నౌకాదళం (5th Fleet) అక్కడ లేకపోతే, ఇరాన్ ఆ జలసంధిపై పూర్తి నియంత్రణ సాధించే అవకాశం ఉంది. ఏదైనా ఉద్రిక్తత తలెత్తితే ఇరాన్ సులభంగా ఈ మార్గాన్ని మూసివేస్తుంది. ఇదే విషయం ఇప్పటికే నిరూపితమైంది. రక్షణ లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీలు నౌకలపై భారీగా ప్రీమియం వసూలు చేస్తాయి. దీనివల్ల భారత్ తదితర దేశాలకు చమురు రవాణా ఖర్చులు పెరిగి, దేశీయంగా పెట్రోల్ ధరలు తారా స్థాయికి చేరుతాయి. ఇక అమెరికా లేని పక్షంలో ఇరాన్ ఆ ప్రాంతంలో ‘బిగ్ బాస్ ‘లా వ్యవహరించటం ఖాయం. ఇది ఆసియా దేశాలకు చమురు సరఫరాలో ఇరాన్ కు మోకరిల్లే పరిస్థితి దాపురిస్తుంది.
Hormuz Crisis : ఆసియా దేశాల సంగతేంటీ ..

హార్ముజ్ జలసంధి నుంచి తన సైనిక బలగాలను ఉపసంహరించుకుంటున్నట్లు అమెరికా ప్రకటించిన నేపథ్యంలో, ఆసియా దేశాలపై తీవ్ర ప్రభావం తప్పదు. ఆసియా దేశాల్లో భారత్, జపాన్, దక్షిణ కొరియా, చైనా తమ ఇంధన అవసరాల కోసం గల్ఫ్ దేశాలపైనే ఆధారపడ్డాయి, . అమెరికా రక్షణ ఉపసంహరణతో ఈ మార్గంలో నౌకల రాకపోకలకు భద్రత క్షీణించి, సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉందనేది ప్రస్తుతం ఆసియా దేశాల ఆందోళన. చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడితే ధరలు బ్యారెల్‌కు $100 నుంచి $200 వరకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

భద్రతా కారణాలతో జపాన్, థాయిలాండ్, సింగపూర్ తదితర దేశాలు ఇప్పటికే అమెరికా నుంచి చమురు దిగుమతికి మొగ్గు చూపుతున్నాయి. గత మూడేళ్లుగా ఎన్నడూ లేనంతగా ఆసియా దేశాలు అమెరికా చమురును భారీగా కొనుగోలు చేస్తున్నాయి. ఇక ఇరాన్ తన చమురును చైనాకు ఎక్కువగా విక్రయిస్తున్నందున, చైనా నౌకలకు ఇరాన్ కొంత మినహాయింపు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల చైనా ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తుంది.
Hormuz Crisis : తెరమీదకు భారత్

తన చమురులో 60% కంటే ఎక్కువ ఈ జలసంధి ద్వారానే భారత్ పొందుతుంది. అమెరికా తప్పుకుంటే , భారత్ తన సొంత యుద్ధనౌకలను (Indian Navy) ఆ పహారా కోసం పంపించాలి. గతంలో ‘ఆపరేషన్ సంకల్ప్ చేపట్టింది. చమురు సరఫరాకు అంతరాయం కలగకుండా ఇరాన్, ఇతర గల్ఫ్ దేశాలతో భారత్ నేరుగా దౌత్య సంబంధాలను పెంచుకోవాలి.
Hormuz Crisis : భారత్ ప్లాన్ బీ

హార్ముజ్ జలసంధి గుండా స్వదేశానికి చేరే చమురు నౌకల రక్షణ కోసం ఇప్పటికే భారత నావికాదళం ఆపరేషన్ సంకల్ప్ నిర్వహణకు సిద్ధంగా ఉంది.2019 నుంచి భారత నావికాదళం ఈ ఆపరేషన్ కింద గల్ఫ్ ప్రాంతంలో యుద్ధనౌకలను మోహరించింది. అమెరికా తప్పుకుంటే, భారత్ తన డిస్ట్రాయర్లు (Destroyers) ఫ్రిగేట్లను (Frigates) అక్కడ శాశ్వతంగా ఉంచాలి. భారతీయ చమురు ట్యాంకర్లకు భారత యుద్ధనౌకలు రక్షణగా ఉంటూ, ఇరాన్ లేదా ఇతర శక్తుల నుంచి దాడులు జరగకుండా చూస్తాయి. అమెరికా లేని పక్షంలో, భారత్ తన మిత్రదేశాలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), సౌదీ అరేబియా ఓమన్ తో కలిసి ఒక “రీజినల్ సెక్యూరిటీ సంకీర్ఱం ” ఏర్పాటు చేసే అవకాశం ఉంది.భారత్ P-8I లాంగ్ రేంజ్ పెట్రోల్ విమానాలు, డ్రోన్లతో నిరంతర నిఘా ఉంచుతారు.
Hormuz Crisis : తెరమీదకు మరో మార్గం

హార్ముజ్ జలసంధి మూసివేసినా, ఉద్రిక్తతలు పెరిగినా భారత్ ప్రత్యామ్నయ మార్గాలను అన్వేషిస్తోంది. సౌదీ అరేబియా, UAE దేశాలకు ఎర్ర సముద్రం (Red Sea) వరకు పైప్‌లైన్లు ఉన్నాయి. వీటి నుంచి నేరుగా ఎర్ర సముద్రం వద్దకు చేర్చి, అక్కడి నుంచి నౌకల ద్వారా భారత్‌కు చమురు తీసుకురావచ్చు. ఇది హార్ముజ్ జలసంధిని పూర్తిగా దాటవేస్తుంది. రెండవది ఇరాన్‌లోని చబహార్ ఓడరేవు హార్ముజ్ జలసంధికి వెలుపల, ఓమన్ గల్ఫ్‌లో ఉంది. దీని ద్వారా చమురు రవాణా చేయడం కొంత సురక్షితం. రష్యా నుండి చమురు దిగుమతులను పెంచుకోవడం ద్వారా మధ్యప్రాచ్యంపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చు.
Hormuz Crisis : ప్రధాన సవాళ్లు

సొంతంగా నౌకలను కాపాడుకోవాలంటే నావికాదళానికి అయ్యే ఖర్చు (Fuel & Logistics) పెరుగుతుంది. అటు ఇజ్రాయెల్, ఇటు ఇరాన్ మకో వైపు అమెరికాతో సమాన సంబంధాలు కొనసాగించడం భారత్‌కు ఒక పెద్ద పరీక్షే. .హార్ముజ్ జలసంధి బాధ్యతలను స్వీకరించి భారత్ ప్రపంచ వేదికపై ఒక “నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్” (Net Security Provider) గా ఎదిగే అవకాశం ఉంది, కానీ ఇది ఆర్థికంగా సైనికంగా భారీ సవాలుతో కూడుకుంది.
