• పరిరక్షణకు కట్టుబడి ఉంటాం…
  • హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ దాసరి శ్రీనివాసులు…
  • కమిషనరేట్ లో బాధ్యతలు స్వీకరణ…
  • కనకదుర్గమ్మ దర్శనం ప్రత్యేక పూజలు…


(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : అలనాటి హిందూ సాంస్కృతిక వైభవం, ధర్మనిరతి, సాంప్రదాయాలు విశ్వవ్యాప్తి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ దాసరి శ్రీనివాసులు (Dasari Srinivasulu) పేర్కొన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ నూతన చైర్మన్గా తిరుపతికి చెందిన దాసరి శ్రీనివాసులు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఎన్టీఆర్ జిల్లాలోని గొల్లపూడిలో ఉన్న దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం (Office of the Commissioner of Endowments) లోని ట్రస్ట్ కార్యాలయంలో ఆయన ట్రస్ట్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలను స్వీకరించారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం కట్టుబడి ఉన్నట్లు చెప్పిన ఆయన, హైందవ సాంప్రదాయాలు సంస్కృతికి మరింత పేరు తెచ్చే విధంగా పనిచేస్తానని తెలిపారు.

హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ నూతన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన దాసరి శ్రీనివాసులు విజయవాడ (Vijayawada) లోని కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. గురువారం ఇంద్రకీలాద్రికి చేరుకున్న ఆయనకు ఆలయ కార్య నిర్వహణ అధికారి సీనా నాయక్ (Seena Nayak) ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో శీనా నాయక్ అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు.

Leave a Reply