Highway | ట్రాక్టర్, ఆటో ఢీ..

Highway | ట్రాక్టర్, ఆటో ఢీ..
Highway | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ట్రాక్టర్, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని వెల్దండ మండలం కొట్ర గేట్ వద్ద శ్రీశైలం హైవేపై ట్రాక్టర్, ఆటో ఢీకొన్న ఘోర ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఈ దుర్ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
