క్రమశిక్షణతో చదివితేనే ఉన్నత శిఖరాలు సాధ్యం

క్రమశిక్షణతో చదివితేనే ఉన్నత శిఖరాలు సాధ్యం

  • డీఈవో రంగయ్య నాయుడు

కరీమాబాద్, ఆంధ్రప్రభ : విద్యార్థులు క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేసినప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని వరంగల్ జిల్లా డీఈవో బి. రంగయ్య నాయుడు అన్నారు.

శనివారం సాయంత్రం కరీమాబాద్‌లోని న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమేన్ హై స్కూల్ స్కూల్ డే కార్యక్రమాన్ని స్థానిక నాని గార్డెన్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఈవో ప్రసంగించారు.

ఈ కార్యక్రమానికి కౌటిల్య వ్యవస్థాపక అధ్యక్షుడు కోడం సురేందర్ అధ్యక్షత వహించగా, ప్రధానోపాధ్యాయురాలు కోడం సబిత స్వాగత ఉపన్యాసం చేశారు. పాఠశాల కరస్పాండెంట్ కోడం శ్రీధర్ కార్యదర్శి నివేదిక సమర్పించారు.

కోడం సురేందర్ మాట్లాడుతూ, 36 సంవత్సరాల క్రితం కరీమాబాద్ పాతబస్తీలో ప్రారంభమైన ఈ పాఠశాల అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ స్థానిక, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో గుర్తింపు పొందిందన్నారు. పాఠశాల ప్రతిష్టను పెంచిన విద్యార్థులు, సహకరించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

డీఈవో రంగయ్య నాయుడు మాట్లాడుతూ, కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని, నేటి విద్యార్థుల కోసం అనేక అవకాశాలు ఎదురుచూస్తున్నాయని అన్నారు. శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో కొత్త ఆవిష్కరణలు చేయాలని సూచించారు. తల్లిదండ్రులు ఎల్లప్పుడూ తమ పిల్లలపై దృష్టి పెట్టాలని, సమాజంలో జరుగుతున్న అన్యాయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ట్రస్మా జనరల్ సెక్రటరీ వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు టీ. బుచ్చిబాబు గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ప్రత్యేక అతిథులుగా 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపళ్ల రవి, వడుప్సా గౌరవాధ్యక్షుడు ఏ. సాంబమూర్తి, ప్రధాన కార్యదర్శి బిల్లా రవి, కోశాధికారి టీ. జ్ఞానేశ్వర్ సింగ్, నాగార్జున స్కూల్స్ అధినేత వెంకటేశ్వర్లు, గిజుబాయి పబ్లికేషన్ డైరెక్టర్ జి. మహేందర్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply