High Court | వారం రోజులు చర్యలు తీసుకోవద్దు..!

High Court | వారం రోజులు చర్యలు తీసుకోవద్దు..!

High Court | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టు (High Court)లో ఊరట లభించింది. అస్సాం సీఎం సతీమణిపై చేసిన వ్యాఖ్యల కేసులో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత పవన్ ఖేరా(Pawan Khera)కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉపశమనం కల్పించింది. అస్సాం ముఖ్యమంత్రి సతీమణిపై చేసిన వ్యాఖ్యల కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా వారం రోజుల పాటు పవన్ ఖేరాపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది. పవన్ ఖేరా తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులు, ఇది రాజకీయంగా వేధించే ప్రయత్నమని కోర్టుకు తెలిపారు.

Leave a Reply