AP | విడదల రజనీకి షాకిచ్చిన హైకోర్టు !
- కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ
మాజీ మంత్రి విడదల రజనీకి ఏపీ కోర్టు షాకిచ్చింది. రెండు వారాల్లోగా ఆమెపై కేసు నమోదు చేయాలని పల్నాడు జిల్లా పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
2019లో సోషల్ మీడియాలో పలు పోస్టులు పెట్టి ప్రశ్నిస్తున్నాడని.. చిలకలూరిపేటకు చెందిన పిల్లి కోటి అనే వ్యక్తిని చిత్రహింసలు పెట్టారంటూ విడుదల రజనిపై ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియా కేసులో విడుదల రజనీ తనను అరెస్ట్ చేసి ఐదు రోజులపాటు స్టేషన్‌లో అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలు పెట్టారని పిల్లి కోటి పోలీసులకు ఫిర్యాదు చేశారు .
పోలీసులు స్పందించకపోవడంతో.. పిల్లి కోటి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన హైకోర్టు రెండు వారాల్లోగా విడదల రజినితో పాటు ఆమె పీఏలు రామకృష్ణ, ఫణి.. అప్పటి సీఐ సూర్యనారాయణపై కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేసింది. కేసు నమోదు చేసి వివరాలు ఇవ్వాలని పల్నాడు పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశించింది.