High Court Judge | నిర్మాణ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలి

High Court Judge | నిర్మాణ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలి

  • హైకోర్టు న్యాయమూర్తి సుజన
  • కోర్టు భావన పనులకు భూమి పూజ

High Court Judge | నిర్మల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : నూతన కోర్టు భవనాల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని హైకోర్టు న్యాయమూర్తి సుజన అన్నారు. ఈ రోజు సారంగాపూర్ మండలం చించోలి. బి గ్రామ సమీపంలో పలు కోర్టుల భవనాల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు సుజన, లక్ష్మణ్, నర్సింగ్ రావు, జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిలలు పాల్గొన్నారు. ముందుగా కోర్టు భవనాల నిర్మాణానికి సంబంధించి భూమి పూజ చేశారు. శిలాఫలకాలను ఆష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా న్యాయమూర్తి సుజన మాట్లాడుతూ… జిల్లాలో నూతన కోర్టు భవనాలకు భూమి పూజ చేయడం సంతోషకరమైన విషయమని వివరించారు.

Leave a Reply