High Court | ఇప్పటి వరకూ 52 కేసులు నమోదు

High Court | ఇప్పటి వరకూ 52 కేసులు నమోదు
High Court | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై ఆందోళన సందర్భంగా దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలపై పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు సోమవారం మధ్యాహ్నం విచారణ జరపనుంది.
ఇప్పటి వరకూ రాష్ట్రంలో అంబటి రాంబాబుపై 52 కేసులు నమోదయ్యాయి. రాజమండ్రి, అనపర్తి, చిత్తూరు, బాపట్ల సహా వివిధ ప్రాంతాల్లో సీఎంను దూషించడంతో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నింటినీ కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేయగా.. దానిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది తేలాల్సి ఉంది.
