Suicide| ఆమె మరణం అమూల్యం..

Suicide| అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ : చిన్నారిని హతమార్చి ఆపై తాను ఆత్మహత్య చేసుకున్న అమూల్య మరణం వెనక వేధింపులే కారణమని బంధువులు పేర్కొంటున్నారు. బాధ్యతాయుత డిప్యూటీ ఎమ్మార్వోగా బాధ్యతలు చేపడుతూ వరకట్న వేధింపులకు గురిచేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమూల్య వరకట్న వేధింపులకు తాళలేక, తల్లిదండ్రులకి చెప్పుకోలేక తాను చనిపోతూ.. కొడుకుని తండ్రి వేధింపులకు గురికాకుండా ఉండేందుకు ఆ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. సాదాసీదా వ్యక్తులు అవగాహన లోపం ఉన్న పల్లెటూరి రైతులు వరకట్న వేధింపులకు గురి చేశారంటే తెలియని తనంతో చేశారని చెప్పొచ్చు. డైరెక్ట్ గా గ్రూప్ టు అధికారిగా, సెలెక్ట్ అయిన రవికుమార్ ఇలా వరకట్న వేధింపులకు గురి చేయడం పై ఒక్కసారిగా అనంతపురం నగర ప్రజలు విస్తు పోయారు. రవికుమార్ పై కఠిన చర్యలు తీసుకొని ఇంకోసారి ఇలా జరగకుండా చూడాలని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
