హెల్మెట్ తప్పనిసరి…

హెల్మెట్ తప్పనిసరి…
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించిన సోమిందేపల్లి పోలీసులు..
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు, డి.ఎస్.పి నరసింగప్ప పర్యవేక్షణలో రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా సోమిందేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హిందూపురం రోడ్డు పెట్రోల్ బంక్ దగ్గర సోమవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమిందేపల్లి ఎస్సై రమేష్ , పోలీసు సిబ్బంది వాహనదారులను ఆపి హెల్మెట్ ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు.
ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరాన్ని వివరించారు. హెల్మెట్ వాడటం ద్వారా ప్రమాదాల సమయంలో ప్రాణాలను రక్షించుకోవచ్చని తెలిపారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారిని హెచ్చరిస్తూ వెంటనే హెల్మెట్ కొనుగోలు చేసి ధరించాలని సూచించారు. ఇకపై హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడితే చట్టపరమైన చర్యలు తీసుకొని రూ. 1035 జరిమానా విధించబడుతుందని స్పష్టం చేశారు. ప్రజల భద్రతే ముఖ్యమని, రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ ధరించాలని పోలీసులు కోరారు. ఈ కార్యక్రమంలో సోమిందేపల్లి ఎస్సై రమేష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు .
