హైదరాబాద్‌లో రాబోయే మూడు రోజులు (13,15 వరకు) అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైడ్రా కమిషనర్ హెచ్చరిక జారీ చేశారు.
ప్రత్యేకంగా నగర ఉత్తర ప్రాంతాలు — మేడ్చల్ జిల్లా, సైబరాబాద్ పరిసరాలు తదితర ప్రాంతాలు — ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే, హైదరాబాద్‌లోని మిగతా ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కమిషనర్ తెలిపారు.
10 నుంచి 15 సెం.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని చోట్ల 20 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు.
ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు తరలించుకోవాలని కమిషనర్ హైడ్రా విజ్ఞప్తి చేశారు.