ఉమ్మడి మహబూబ్నగర్ బ్యూరో, ఆంధ్రప్రభ : పాపం ఆ చిన్నారులకు తెలియదు అదే ఆఖరి రోజు అని… అల్లారు ముద్దుగా పెంచిన తన తండ్రే కాలయుముడవుతాడని అనుకోలేదు కూడా.. బైక్ మీద నుంచి తండ్రి పిలవగానే ఎక్కడికో తీసుకు వెళుతున్నారని సంబరపడిన ఆ పిల్లలకు అనంత లోకాలకు వెళ్లిపోతామని ఊహించలేదు..
ఇదీ ఓ తండ్రి కర్కశానికి ముగ్గురు పిల్లలు బలైన దీనగాధ.! కన్నబిడ్డలను కర్కశంగా కడతేర్చి, అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దుర్ఘటన నాగర్ కర్నూల్ (Nagar kurnool) జిల్లాలో సంచలనం సృష్టించింది.
సంఘటన ఇలా జరిగింది..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుండి గుత్త వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన ముగ్గురు పిల్లలను తెలంగాణ ప్రాంతానికి తీసుకువచ్చి నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో గత నెల 30న ముగ్గురు పిల్లలతో తండ్రి గుత్తా వెంకటేశ్వర్లు (Gutta Venkateswarlu)(38) బైక్పై బయటకు వచ్చాడు. వెల్దండ మండలం పెద్దాపుర్ గ్రామ శివారులో విగత జీవిగా పడి ఉండడం. పక్కనే పురుగుల మందు డబ్బా కనిపించడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లుగా ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు.
డిండి ప్రాజెక్టు పరిసరాల్లో తండ్రి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు తిరిగినట్లు గుర్తించారు. అయితే 3 సెప్టెంబరు బుధవారం నాడు వెంకటేశ్వరు మృతదేహం లభ్యం కాగా.. చిన్నారుల ఆచూకీ మర్నాటి వరకూ గాలింపు చర్యలు (Search operations) చేపట్టారు. ఈ క్రమంలో గాలింపు చేపట్టిన పోలీసులకు ఆచూకీ లభించింది. ఉప్పునుంతల మండలం సూర్య తండా సమీపంలో వెంకటేశ్వర్లు చిన్నకుమార్తె వర్షిణి(16), కుమారుడు శివదర్శ(1) మృతదేహాలు, తాండ్ర సమీపంలో పెద్దకుమార్తె మోక్షిత(8) మృతదేహం లభ్యమయ్యాయి.
చిన్నారులను పెట్రోల్ పోసి (Pour petrol) తగుల బెట్టినట్లు సమాచారం. అచ్చంపేట డీఎస్పీ పల్లె శ్రీనివాస్ సీఐ నాగరాజు, ఎస్ఐలు విజయ భాస్కర్, తిరుపతి రెడ్డిలు మరి కొంత మంది పోలీస్ సిబ్బంది వివిధ గ్రామాలకు చెందిన దాదాపు 100మందితో గాలింపు చర్యలు చేపట్టారు. ఉప్పునుంతల మండలం సూర్య తండా (Surya Thanda) సమీపంలో ఇద్దరి పిల్లలను తండ్రి గుత్త వెంకటేశ్వర్లు ముందుగా కాల్చి చంపి వేసినట్టు పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు.

