HDFC | గ్యాస్ కట్టర్ సాయంతో మూడు ఏటీఎంలలో భారీ దోపిడి

హైదరాబాద్‌ జీడిమెట్లలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. గజులరామారం మార్కండేయ నగర్ చౌరస్తాలోని HDFC ATM సెంటర్ లో దుండగులు గంటపాటు అందులోనే ఉండి మూడు ఏటీఎం యంత్రాలను పూర్తిగా కట్ చేసి, అందులోని భారీగా నగదును అపహరించి పరారయ్యారు.

గత రాత్రి ముగ్గురు దుండగులు ATM సెంటర్‌ లోకి ప్రవేశించారు. గ్యాస్ కట్టర్ సాయంతో మూడు ATMలను కొల్లగొట్టారు. ఆ తర్వాత మిషన్లలోని నగదును అపహరించడానికి దుండగులు ఒక గంట సమయం తీసుకున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. ముఖానికి మాస్క్, తలపై క్యాప్ ధరించి కనిపించిన దొంగలు పూర్తి ప్రణాళికతో చోరీకి దిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

అయితే, ATM సెంటర్ లోని అలారం దొంగలు ప్రవేశించిన ఒక గంట తరువాత మోగింది. సమాచారం అందుకున్న వెంటనే జీడిమెట్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనతో క్లూస్ టీమ్ లను రంగంలోకి దించి ఆధారాలను సేకరిస్తున్నారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా దుండగులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు

ATM దొంగలను పట్టుకునేందుకు పోలీసులు నలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జీడిమెట్ల పరిసరాల్లో సీసీ కెమెరాలను పరిశీలిస్తూ.. వాహనాల రవాణా, అనుమానాస్పద కదలికలపై దృష్టిసారించారు. .

Leave a Reply