హ్యాట్సాఫ్ “స్టేషన్ ఘన్ పూర్ “పోలీసులు!

హ్యాట్సాఫ్ “స్టేషన్ ఘన్ పూర్ “పోలీసులు!

  • నామినేషన్ నుంచి లెక్కింపు వరకు కట్టుదిట్టమైన బందోబస్తు
  • జాతర రద్దీలోనూ నియంత్రణలో ప్రతిభ చాటిన పోలీసులు
  • అవాంఛనీయ ఘటనలకు చెక్…కట్టుదిట్టమైన భద్రత
  • ప్రజా భద్రతే పరమావధిగా సేవలందించిన సిబ్బంది
  • భద్రతా పరిరక్షణలో ప్రజల నుంచి ప్రశంసలు అందుకున్న పోలీసులు
  • శాంతి వాతావరణాన్ని కాపాడిన స్టేషన్ ఘన్ పూర్ పోలీసులు

స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : పోలీస్ అంటే కేవలం యూనిఫాం ధరించిన ఉద్యోగి కాదు…ప్రజల కోసం ప్రాణం పెట్టే నిజమైన రక్షకుడు. 24 గంటలు కుటుంబాన్ని దూరంగా పెట్టి, ఆనందాలు, బాధలు పక్కనబెట్టి సమాజ శాంతి కోసం కాపలా కా స్తూ నిలిచే సేవామూర్తి. మనకు ప్రమాదం అనిపించిన ప్రతి సందర్భం లో ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసే..ఎందుకంటే ప్రజల ప్రాణాలు, ఆస్తులు సురక్షితంగా ఉండాలని వారు నిరంతరం అప్రమత్తంగా ఉంటారు.

ఎండ తీవ్రంగా ఉన్నా, వాన కురిసినా, పండుగ రోజుల్లో అయినా, అర్ధరాత్రి అయినా విధి పిలిస్తే వెంటనే స్పందించడం వారి ధర్మం. రోడ్డు ప్రమాదాలు, కుటుంబ వివాదాలు, నేర సంఘటనలు, ప్రకృతి విపత్తు లు, ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ మొదటగా అడుగు పెట్టేది పోలీసే. మొత్తానికి వారి త్యాగం కనిపించకపోయినా వారి సేవకు సమాజం ఎప్పటికీ ఋణపడి ఉంటుంది. ఇటీవల కాలంలో నిర్వహించిన ఎన్ని కల విధులు ప్రజల హృదయాలను తాకేలా నిలిచాయి. ఎన్నికలైనా, జాతరైనా ప్రతి సందర్భంలో ప్రజల భద్రతే మా ధ్యేయం అన్న నిబద్ధత తో కర్తవ్య నిర్వహణ చేసి శభాష్ అనిపించుకున్నారు స్టేషన్ ఘన్ పూర్ పోలీసులు.

స్టేషన్ ఘన్‌పూర్ పోలీసుల సేవలకు శభాష్:

ఎన్నికల నుంచి జాతర వరకు…కట్టుదిట్టమైన భద్రతతో కర్తవ్య నిబద్ధత స్టేషన్ ఘన్‌పూర్ పరిధిలో పోలీస్ సిబ్బంది ఇటీవల కాలంలో నిర్వహిం చిన విధులు ప్రజల ప్రశంసలు అందుకుంది. సర్పంచ్ ఎన్నికల నుండి మున్సిపల్ ఎన్నికల వరకు అలాగే సమ్మక్క సారళమ్మ జాతర సంద ర్భంగా కూడా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించి శాంతి భద్రతలు కాపాడారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాలు, జనగామ డీసీపీ, స్టేషన్ ఘన్ పూర్ ఏసీపీ సూచనల మేరకు సీఐ జి. వేణు నాయ కత్వంలో ఎస్‌ఐలు వినయ్ కుమార్, రాజేష్, పోలీస్ సిబ్బంది సమర్థ వంతంగా విధులు నిర్వహించారు. ఎన్నికల నామినేషన్ దశ నుండి ప్రచారం, పోలింగ్, లెక్కింపు వరకు ప్రతి దశలో పోలీసులు అప్రమత్తం గా ఉండి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కృషి చేశారు. గ్రామ గ్రామాన గస్తీ కాస్తూ ప్రజల్లో భరోసా కల్పించారు.

-సర్పంచ్ ఎన్నికల్లో అప్రమత్తతే ఆయుధం:

మొదటగా జరిగిన సర్పంచ్ ఎన్నికల సమయంలో పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించారు. గ్రామాల్లో ఎన్నికల వేడి ఉన్నప్పటికీ ఎలాంటి వివాదాలు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రతి గ్రామంలో గస్తీ నిర్వహిస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. నామినేషన్ దశ నుంచే పర్యవేక్షణ పెంచి, పోలింగ్ రోజు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా భరోసా కల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసులు చూపిన చొరవకు ప్రజలు అభినందనలు తెలిపారు.

మినీ సమ్మక్క సారలమ్మ జాతరలో ప్రతిభ చాటిన పోలీసులు:

ప్రసిద్ధ సమ్మక్క సారళమ్మ జాతర సందర్భంగా స్టేషన్ ఘన్ పూర్ మండ లంలోని మినీ ఇప్పగూడెం చింత గట్టు, తాటికొండ, జిట్టాగూడెం గ్రామా ల పరిధిలోని మల్లన్న గండి ప్రాంతాల్లో స్టేషన్ ఘన్ పూర్ పోలీస్ సిబ్బం ది భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేలాది మంది భక్తులు తరలి వచ్చే ఈ జాతరలో రాత్రింబవళ్లు విధులు నిర్వర్తిస్తూ ఎలాంటి చిన్నపా టి ఘటన కూడా జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించారు. ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల రాకపోకల సౌకర్యం, అత్యవసర పరిస్థితుల్లో సహా యంతో ప్రతి అంశం లో పోలీసులు ముందుండి సేవలందించారు. భక్తు లు ప్రశాంతంగా దర్శనం చేసుకుని తిరిగి వెళ్లేలా పూర్తి సహకారం అందించారు. జాతర ఘనంగా ముగిసే వరకు నిద్రలేని రాత్రులు గడి పిన పోలీస్ సిబ్బంది సేవలు అందించి ప్రతిభను చాటారు.

-మున్సిపల్ ఎన్నికల్లో కట్టుదిట్టమైన పర్యవేక్షణ:

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా స్టేషన్ ఘన్‌పూర్ పోలీ సులు కీలక పాత్ర పోషించారు. నామినేషన్ దాఖలు దశ నుంచే చట్ట బద్ధతను కాపాడుతూ భద్రతా చర్యలు చేపట్టారు. ప్రచారం సమయం లో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా రు. పోలింగ్ రోజున ప్రతి కేంద్రంలో బందోబస్తు ఏర్పాటు చేసి ఓటర్లకు భద్రత కల్పించారు. ఓట్ల లెక్కింపు వరకు పూర్తి అప్రమ త్తతతో విధులు నిర్వర్తించారు. ఎన్నికలు పారదర్శకంగా పూర్తయ్యేలా కృషి చేశారు.

-ప్రజల గుండెల్లో నిలిచిన సేవలు:

సర్పంచ్ ఎన్నికలు, సమ్మక్క సారలమ్మ జాతర, మున్సిపల్ ఎన్నికలు మూడు ప్రధాన సందర్భాల్లోనూ స్టేషన్ ఘన్‌పూర్ పోలీస్ సిబ్బంది కర్తవ్య నిబద్ధతతో పని చేసి ప్రజల గుండెల్లో నమ్మకంగా నిలిచారు.
వారికి విధి అంటే కేవలం పని కాదు…ప్రజల ప్రాణాలు, భద్రత, విశ్వాసం అన్నీ కలిసిన బాధ్యత..రాత్రింబవళ్లు అలసట లేకుండా సేవలందించిన పోలీస్ సిబ్బందికి ప్రజల నుంచి శబాష్ అనిపించుకుంటున్నారు.

-ప్రజల సహకారంతోనే ఎన్నికలు, జాతర విజయవంతం : (స్టేషన్ ఘన్ పూర్ సీఐ జి. వేణు)

ప్రజల సహకారం వల్లే ఎన్నికలు, జాతర కార్యక్రమాలు విజయవంతం గా నిర్వహించగలిగాం. ప్రతి సందర్బంలో ప్రజలు ఇచ్చిన సహకారం మాకు ఎంతో తోడ్పాటుగా నిలిచింది. అందరికీ మా కృతజ్ఞతలు తెలి యజేస్తున్నాం. మేము ఎల్లప్పుడూ ప్రజల భద్రతనే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తుంటాం. శాంతి వాతావరణం నెలకొనేలా నిరంతరం కృషి చేస్తాం. ప్రజలు కూడా చట్టాలను గౌరవిస్తూ పోలీసులకు సహకరిస్తే మరింత మెరుగైన సేవలు అందించగలం. స్టేషన్ ఘన్ పూర్‌లో శాంతి యుత వాతావరణం కొనసాగేందుకు మా సిబ్బంది అప్రమత్తంగా విధు లు నిర్వహిస్తూనే ఉంటారు.

Leave a Reply