Harish Rao | బీఆర్ఎస్ గద్దెల జోలికొస్తే… రేవంత్ గద్దె కూలుస్తాం..

Harish Rao | బీఆర్ఎస్ గద్దెల జోలికొస్తే… రేవంత్ గద్దె కూలుస్తాం..
- మాజీ మంత్రి హరీశ్ రావు
Harish Rao | హైదరాబాద్, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ గద్దెల జోలికొస్తే… రేవంత్ గద్దె కూలుస్తామని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… బీఆర్ఎస్ జెండా గద్దెలలో లేదు.. తెలంగాణ ప్రజల గుండెల్లో ఉందన్నారు. రేవంత్ బీఆర్ఎస్ గద్దెలు కూల్చాలనడాన్ని ఖండిస్తున్నామన్నారు. మంత్రుల మధ్య వాటాల పంచాయితీ నడుస్తోందన్నారు.
సింగరేణి నైని గనుల టెండర్లపై సీబీఐ విచారణ జరపాలన్నారు. బీజేపీతో రేవంత్ కుమ్మక్కు కాకపోతే సీబీఐ విచారణకు సిద్ధమా అన్నారు. విచారణకు ఆదేశిస్తే ఆధారాలు సమర్పిస్తామన్నారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధన వెనుక కుట్ర ఉందన్నారు. సింగరేణి టెండర్ల కోసం మంత్రులు గొడవపడ్డారన్నారు. డెక్కన్ సిమెంట్స్ ప్రతినిధులను సీఎం సన్నిహితులు బెదిరించారన్నారు. కొండా సురేఖ, సీఎం రేవంత్ మధ్య పంచాయితీ నడిచిందన్నారు.
CLICK HERE TO READ వన దేవతలను దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎస్ఆర్
