108 అంబులెన్స్ లోనే సుఖ ప్రసవం..

108 అంబులెన్స్ లోనే సుఖ ప్రసవం..

ఉట్నూర్‌, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్(Adilabad) జిల్లా ఉట్నూర్ మండలంలోని హీరాపూర్ (పి) గ్రామానికి చెందిన గర్భిణీ మహిళా పుస్నక గోదావరి కి పురిటి నొప్పులు రావడంతో ఈ రోజు ఉట్నూర్(Utnoor) ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వచ్చారు. అక్కడ పరీక్షలు నిర్వహించి ఉమ్మ నీరు పోవడంతో ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఆదిలాబాద్ రిమ్స్ ప్ర‌భుత్వ ఆసుప‌త్రి(RIMS Government Hospital)కి రిఫర్ చేశారు.

దీంతో 108 అంబులెన్సు(108 Ambulance)లో గ‌ర్భిణీ మ‌హిళ‌ను త‌ర‌లిస్తుండ‌గా మార్గ మధ్యలో ఇంద్రవెల్లి సమీపంలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఈఏంటీ(ENT) దత్తాత్రేయ అంబులెన్స్ లోనే పురుడు పోశారు. ఆడ బిడ్డకి జన్మనిచ్చింది. వారిని ఇంద్రవెల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని ఈఎంటీ కుంబోజి దత్తాత్రేయ, పైలెట్ మడావి బాపు రావు, ఆశ వర్కర్ జయసుధ తెలిపారు.

Leave a Reply