Guruvayigudem | హనుమద్ హోమం..

Guruvayigudem | జంగారెడ్డిగూడెం, ఆంధ్రప్రభ : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం, గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఆదివారం “హనుమద్ హోమం” ఆలయ అర్చకులు, వేద పండితులు ఆధ్వర్యంలో జరిగింది. స్వామి వారి సన్నిధిలో హనుమద్ హోమం ప్రతీ ఆదివారం భక్తులకు ఆర్జిత సేవ(aarjitha seva)గా దేవస్థానం నిర్ణయించింది. హనుమద్ హోమ కార్యక్రమంలో ప్రత్యక్షంగా కానీ.. పరోక్షంగా కానీ పాల్గొన్న వారికి మానసిక, శారీరక(Mental and physical) ఆరోగ్యంతో పాటు విద్యార్దులకు విద్యా ప్రాప్తి కలుగుతుందని, కుటుంబ సక్యత, అన్యోన్య దాంపత్యం, సంతానం కలిగి సర్వత్రా విజయం చేకూరుతుందనేది విశ్వాసం. కనుక భక్తులు దేవస్థానంలో ప్రతీ ఆదివారం జరుగు ఈ హనుమద్ హోమంలో పాల్గొనవలసినదిగా ఆలయ సహాయ కమీషనరు కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి.చందన(Rv chandana) తెలియజేసారు. హోమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేవస్థానంలో ఉచిత అన్న ప్రసాదాన్ని అందించారు.

Leave a Reply