Guntur | డిఆర్వో ఖాజావలికి రాష్ట్ర స్థాయి అవార్డు..

Guntur | డిఆర్వో ఖాజావలికి రాష్ట్ర స్థాయి అవార్డు..

● My India – My Vote థీమ్ తో ఓటర్లకు ఉత్తమ అవగాహనకు రాష్ట్ర అవార్డు
● ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చేతుల మీదుగా అవార్డు ప్రదానం

Guntur | గుంటూరు కలెక్టరేట్ – ఆంధ్రప్రభ : జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి ఉత్తమ ఎలక్టోరల్ విధానాలను అమలు చేసినందుకు రాష్ట్ర స్థాయి అవార్డును అందుకున్నారు. విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చేతుల మీదుగా అవార్డును ఈ రోజు అందుకున్నారు. ఈ ఏడాది “నా భారత్ – నా ఓటు” (My India, My Vote) థీమ్ తో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రియాశీలకంగా పనిచేయడంతో జిల్లా రెవిన్యూ అధికారికి అవార్డు లభించింది.

Leave a Reply