Gun Sansthan Temple | ఘనంగా జై జంగో జై లింగో దీక్ష స్వీకరణ

Gun Sansthan Temple | ఘనంగా జై జంగో జై లింగో దీక్ష స్వీకరణ
- దీక్షల స్వీకరణకు తరలివచ్చిన ఆదివాసీలు
Gun Sansthan Temple | జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని జంగంరావు జీగూడ దీక్ష భూమిలో ఈ రోజు రాజేశ్వర్ మహారాజ్(Rajeshwar Maharaj) సమక్షంలో ఆదివాసీలు దీక్ష కంకణాలు కట్టుకొని దీక్షలకు శ్రీకారం చుట్టారు. దీక్షల స్వీకరణకు తెలంగాణ, మహారాష్ట్ర నుంచి వందలాది మంది భక్తులు తరలివచ్చి దీక్షలు స్వీకరించారు.
జంగం గన్ సంస్థాన్ ఆలయం(Gun Sansthan Temple)లో దీక్షాపరులు ప్రత్యేక పూజలు చేశారు.ఈ దీక్షలు స్వీకరించిన దీక్ష పరులు నెలరోజుల పాటు నియమనిష్ఠలతో జై జంగో జై లింగో నిర్వహిస్తారు. ఈ దీక్షల స్వీకరణ కార్యక్రమంలో మడవి రాజేశ్వర్ మహారాజ్ మాట్లాడుతూ పవిత్ర పుష్యమాసం సందర్భంగా నేటి నుంచి జంగో లింగో దీక్షలు స్వీకరించిన దీక్షాపరులు పవిత్ర మాసంలో చేడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఒక ఆధ్యాత్మిక(Spiritual) కేంద్రంగా పిలువ బోతుందని నెల రోజుల పాటు జంగో లింగో దీక్ష సాగుతుందని జై జంగో జై లింగు దీక్షల పీఠాధిపతి కుంర భగవంత్ రావు అన్నారు.
ఈ కార్యక్రమంలో ఘన్ సంస్థాన్ ఆద్యుక్షుడు ఆత్రం రఘునాథ్, గేడం జగజీవన్, ఆదిలాబాద్ జిల్లా సార్ మెడి మెశ్రం దుర్గు, జ0గాం నూతన సర్పంచ్ పేందుర్ అర్జున్, నాయకులు ఉపాధ్యాయ సంఘం నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
