కొల్చారం… ఆంధ్రప్రభ – మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని పైతర గ్రామానికి చెందిన దళిత నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మరెల్లి అనిల్ కుమార్ పై గుర్తు తెలియని దుండగులు గన్ తో కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స కోస హాస్పిటల్ కు తరలిస్తుండగా మరణించాడు.
హైదరాబాదులో గాంధీభవన్లో జరిగిన సమావేశానికి అటెండ్ అయ్యి తిరిగి స్వగ్రామానికి వస్తున్న తరుణంలో మండల పరిధిలోని చిన్నగనాపూర్ సబ్స్టేషన్ వద్ద కారులో ఒంటరిగా వెళ్తున్న అతనిపై అటాక్ చేసి కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది సంఘటన స్థలంలో బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించారు . కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.