అమెరికా : మరోసారి కాల్పుల మోత మోగింది. అమెరికా (America) లోని చికాగో లో ఫైరింగ్ మోతలు, బాధితుల హాహాకారాలతో దద్దరిల్లింది. చికాగోలోని ఓ నైట్ క్లబ్ వెలుపల ఓ దుండగుడు (Night Club Firing)పాల్పడటంతో నలుగురు అక్కడికక్కడే మరణించగా.. 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన చికాగో (Chicago) నగరంలోని 311 వెస్ట్ చికాగో అవెన్యూలో స్థానిక రాపర్ మెల్లో బక్స్ ఆల్బమ్ విడుదల వేడుక అనంతరం జనం బయటకు వస్తుండగా రాత్రి 1:45 గంటల సమయంలో (స్థానిక కాలమానం) జరిగింది.
చికాగో పోలీసు విభాగం తెలిపిన వివరాల ప్రకారం.. దుండగులు అనేక వాహనాల్లో వచ్చి కాల్పులు జరిపినట్లు ప్రాథమిక సమాచారం ఉందన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, దర్యాప్తు జరుగుతోందన్నారు. గతంలో కూడా ఈ నైట్ క్లబ్ వద్ద కాల్పులు జరగగా.. అధికారులు క్లబ్ ను మూసివేశారని, ఇటీవలే తిరిగి ఆర్టిస్ లాంజ్‌గా తిరిగి ఓపెన్ చేశారని సమాచారం.