బాధిత రైతులకు నష్టపరిహారం అందించాలి,

బాధిత రైతులకు నష్టపరిహారం అందించాలి,

జిల్లా కలెక్టర్ వినతిపత్రం అందజేసిన నవాబుపేట రైతులు,

చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని నవాబ్ పేట పరిధిలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే లో రైతుల భూముల్లో పైపులైన్స్, బావులు, చెట్లను కోల్పోతున్న బాధితులకు నష్టపరిహారం అందించాలని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మకు రైతులు వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ స్పందించి 10 రోజులలో బాధిత రైతులకు నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు రైతులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం లో, రైతులు కసిరెడ్డి రత్నాకర్ రెడ్డి, కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పింగిలి శ్రీనివాస్ రెడ్డి, బిళ్ల సరోత్తం రెడ్డి, నర్సింహారెడ్డి, దువ్వల లక్ష్మి, చెక్క నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply