లబ్దిదారుల కృతజ్ఞతలు..
కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : కమ్మర్ పల్లి మండల కేంద్రానికి చెందిన సుంకేట రమేష్(Sunketa Ramesh)కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కును కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామశాఖ అధ్యక్షుడు సల్లురి గణేష్(Salluri Ganesh) మాట్లాడుతూ.. రూ .23,000 చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు అందజేసినట్లు తెలిపారు.
లబ్ధిదారులు మాట్లాడుతూ.. చెక్కు మంజూరికి కృషి చేసిన బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి(Mutyala Sunil Kumar Reddy)కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పూజారి శేఖర్, కంపదండి అశోక్, వేములవాడ జగదీష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

