బదిలీ అయిన ఎస్ఐలకు ఘన సన్మానం..

సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ ; కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్( యు) లింగాపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్సైలుగా పనిచేసిన రామకృష్ణ,గంగన్నలకు శుక్రవారం సిర్పూర్ యు పోలీస్ స్టేషన్లో ప్రజా ప్రతినిధులు సర్పంచులు ఘన సన్మానం చేశారు.
ఈ సన్మాన కార్యక్రమంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ కనక యాదవరావు, జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొడప ప్రకాష్, జైనూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆత్రం భగవంతరావు జైనూర్ సీఐ రమేష్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ ఏజెన్సీ మండలాల్లో ఎస్సైలు చేసిన సేవలు ప్రశంసనీయమని అన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణలో వారి సేవలు ఎంతో అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఇక్కడ అందించిన సేవల విధంగానే బదిలీ అయిన ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణకు మంచి సేవలందించి గుర్తింపు పొందాలని వారు కోరారు. సిర్పూర్ యు ఎస్ ఐ రామకృష్ణ బెల్లంపల్లికి బదిలీ కాగా లింగాపూర్ ఎస్సై గంగన్న ఆసిఫాబాద్ ఎస్పీ కార్యాలయ ఆటాచ్ కు బదిలీ కావడంతో ఈ సన్మాన కార్యక్రమం చేయడం ఎంతో సంతోషకరమని బదిలీ అయిన ఎస్సైలు పేర్కొన్నారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో సేవలందించినందుకు ఎంతో సంతోషంగా ఉందని బదిలీ అయిన ఎస్ఐలు రామకృష్ణ గంగన్న అన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో జై నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచుల సంఘం నాయకులు ఆత్రం ఓం ప్రకాష్, కుమ్ర భీమ్రావు గణపత్ రావ్ ఆత్రం మీరా జాలింషా , సర్పంచ్ లు సెడమకి జానే రావు, మడావి లక్ష్మణ్, ఆత్రం విజయలక్ష్మి బిర్షావ్,కురుకుటే ప్రహ్లాద్, భూపతి వివిధ పంచాయతీల సర్పంచులు, పోలీసులు, నాయకులు పాల్గొన్నారు.
