Grand Christmas | టీఎస్సార్ ఆహ్వానం..

Grand Christmas | టీఎస్సార్ ఆహ్వానం..

Grand Christmas, కోడూరు, ఆంధ్ర ప్రభ : టీఎస్ఆర్ గ్రూప్స్ చైర్మన్ తిరుపతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీన కోడూరు వేదికగా నిర్వహిస్తున్న 17వ మెగా గ్రాండ్ క్రిస్మస్ వేడుకలకు పామర్రు శాసనసభ్యులు వర్ల కుమారరాజాను టీఎస్సార్ గ్రూప్ చైర్మన్ తిరుపతి శ్రీనివాసరావు ఆహ్వానించారు.

పామర్రు కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకొని 17వ గ్రాండ్ క్రిస్మస్ ఆహ్వానకార్డును అందజేశారు. ఈ సందర్భంగా 17వ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల గురించి తిరుపతి శ్రీనివాసరావు ఎమ్మెల్యేకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు దిరిశం వెంకట్రావు, కోట కరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply