గ్రామ పంచాయతీ కార్మికులకు ఘనంగా సన్మానం

ములకలపల్లి, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీ కార్మికుల ను కమాలపురం సర్పంచ్ వగ్గేల రాధ శాలువాలతో ఘనంగా ఘనంగా సన్మానించారు. ఆదివారం మండల పరిధిలోని కమలాపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన 99 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో సర్పంచ్ వగ్గేల రాధ పాల్గొని గ్రామ పంచాయతీ కార్మికులను సత్కరించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ వగ్గేల రాధ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల శ్రమ ను గుర్తించి కార్మికులను సన్మాన, అభినందన కార్యక్రమాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వనికి అభినందనీయమన్నారు. గ్రామాల్లో పెరుకుపోయిన మురికి కుప్పలను తోలగించడం లో గ్రామ పంచాయతీ కార్మికుల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. గ్రామ పరిశుభ్రతను కాపాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో గ్రామ పంచాయతీ కార్మికుల శ్రమ ఉందని అన్నారు.
అనంతరం రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల రక్షణ కోసం అందించిన యూనిఫాం, సబ్బులు, కొబ్బరి నూనె, షాపులు,ఇతర శానిటేషన్ వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ దోమల అరుణ్ కుమార్, వార్డు సభ్యులు గుజ్జుల చిన్న పపాయ్య, సరోజిని,నకిరేకంటి నాగేశ్వరరావు,వెంకటమ్మ, ఇంద్ర, రామకృష్ణ, గ్రామ పంచాయతీ కార్మికులు వగ్గేల ధారయ,కుంజా శ్రీను,సిద్దుల వెంకటేశ్వర్లు, అంగన్వాడీ కార్యకర్తలు కరపటి పార్వతి,కుంజా సంధ్య,మిడియం రాణి, తదితరులు పాల్గొన్నారు.
