శ్లోక ది స్కూల్‌లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్‌లో ఉన్న శ్లోక ది స్కూల్‌లో విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ పుల్లూరి ప్రకాష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రముఖ వైద్యులు, సర్జన్ డా.కోనేటి శ్రీధర్ మాట్లాడుతూ.. గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో ఉత్సాహం పెరుగుతుందని అన్నారు. విద్యార్థులు చురుకుగా పాల్గొని భగవద్గీత శ్లోకాలను పారాయణం చేయడం ప్రశంసనీయమని అభిప్రాయపడ్డారు.
స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ డి.అసన్ మాట్లాడుతూ శ్లోక ది స్కూల్ విద్యార్థులు విద్యలోనే కాకుండా కళారంగాల్లో కూడా ప్రతిభ చూపుతున్నారని తెలిపారు. ప్రత్యేక అతిథిగా పాల్గొన్న సంగారెడ్డి మున్సిపాలిటీ 33వ వార్డ్ కౌన్సిలర్ విస్లావత్ రవీందర్ మాట్లాడుతూ స్వల్ప కాలంలోనే స్కూల్ మంచి అభివృద్ధి సాధించి విద్యార్థులను సమగ్రంగా తీర్చిదిద్దుతున్నదని కొనియాడారు. ఇస్కాన్ సంస్థ మేనేజర్ విభీషణ్ దాస్ మాట్లాడుతూ విద్యార్థులు భగవద్గీత శ్లోకాల పఠనంలో నైపుణ్యం ప్రదర్శించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ పవిత్ర రెడ్డి, చందనరెడ్డి, శ్వేతా పల్లె, సీమ, వైశాలి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
