గవర్నర్‌కు ఘన స్వాగతం

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ (Andhra Pradesh State Governor S. Abdul Nazeer)కు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆత్మీయ స్వాగతం పలికారు. రాయలసీమ యూనివర్సిటీ (Rayalaseema University) నాలుగో స్నాతకోత్సవం, కర్నూలు మాంటెస్సోరి పాఠశాల స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు గవర్నర్ బుధవారం ఓర్వకల్లు విమానాశ్రయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. గవర్నర్‌కు జిల్లా అధికారుల బృందం, విశ్వవిద్యాలయ ప్రతినిధులు స్వాగతం పలికారు. రాష్ట్ర గవర్నర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.



