Governor | ఫించన్ల కోసం ఏటా రూ.34వేల కోట్లు..

Governor | ఫించన్ల కోసం ఏటా రూ.34వేల కోట్లు..
Governor | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పింఛన్ల కోసం ఏటా రూ.34 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఇంత పెద్దమొత్తంలో పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం మనదేనని సీఎం చంద్రబాబు అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో ఆయన మాట్లాడుతూ… చట్టసభ ప్రజా దేవాలయమని, వైసీపీ పాలనలో అసెంబ్లీ బూతులకు నమూనాగా ఉండేదని సీఎం చంద్రబాబు విమర్శించారు. ప్రస్తుతం సభలో అర్థవంతమైన చర్చలు జరుగుతున్నాయని, ఇటీవల నిర్వహించిన మాక్ అసెంబ్లీలో విద్యార్థులు సభ్యుల కంటే బాగా మాట్లాడారని ప్రశంసించారు.
ఏపీ అభివృద్ధికి సహాయం అందించిన కేంద్రాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. కేంద్రం మద్దతు ఇచ్చి వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని కోలుకునేలా చేసిందన్నారు. హామీల అమలుకు కేంద్రం కూడా బాధ్యత తీసుకుందని చెప్పారు. ఈఏడాదిలో 1000 ఏసీ బస్సులను తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.
