గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ద్యేయం..!

మాక్లూర్, ఆంధ్రప్రభ : గ్రామాల అభివృద్దే ప్రభుత్వ ద్యేయమని, అందుకోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ అన్నారు. మండల పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో గురువారం 99 రోజుల ప్రగతి ప్రణాళిక లో భాగంగా నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభకు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిరణ్ కుమార్ తో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ… గ్రామ సభల్లో గ్రామస్తుల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారానే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. రైతు, మహిళల కోసం సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలు పక్కాగా అమలు చేస్తుందని పేర్కొన్నారు.
అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిరణ్ కుమార్ మాట్లాడుతూ అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతాయని తెలియజేశారు. గ్రామ సభల ద్వారానే క్షేత్ర స్థాయిలో గ్రామంలోని సమస్యలు పరిష్కారమౌతాయని వెల్లడించారు. ఇందులో ఎంపీడీఓ యం. బ్రహ్మనందం , గ్రామ సర్పంచ్ లత, సెక్రటరీ అరుణ్, గంగాధర్ గౌడ్, జి.బి గోవర్ధన్ , తదితరులు పాల్గొన్నారు.
