విద్యకు ప్రభుత్వాల పెద్దపీట‌..

  • కేంద్రీయ విద్యాలయంలో సీటు వచ్చిందంటే అదృష్టవంతులు..
  • నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి…


నంద్యాల బ్యూరో, అక్టోబర్ 8 (ఆంధ్రప్రభ) : నేటితరం విద్యార్థులకు భారతీయ సంస్కృతీ, సంప్రదాయ విలువలతో కూడిన విద్య ఎంతో అవసరమ‌ని, కేంద్రీయ విద్యాలయంలో చదువుకునేందుకు సీటు వచ్చిందంటే వారి పిల్లలు అదృష్టవంతులని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాయ‌ని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, డాక్టర్ బైరెడ్డి శబరి (Baireddy Shabari) పేర్కొన్నారు.

బుధవారం నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో నూతన కేంద్రీయ విద్యాలయ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులను ఉద్దేశించి ఎంపీ మాట్లాడారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) విద్య పట్ల ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకు తీసుకెళ్లుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా విద్యకు అధిక నిధులు రాబట్టేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. సమస్యలు తొలగించి డోన్ కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు అయిందన్నారు.

జిల్లా కేంద్రం నంద్యాల (Nandyal) లో కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అధికంగా ఉండడంతో మరో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని తాను కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా, మంజూరుకు అంగీకారం తెలిపినట్లు ఎంపీ తెలిపారు. కేంద్రీయ విద్యాలయంలో చదువుకునేందుకు చాలా పోటీ ఉందని, ఇక్కడ సీటు వచ్చిందంటే మీ పిల్లలు ఎంతో అదృష్టవంతులని, వారు ఇక సెటిల్ అయినట్లేనని, తల్లిదండ్రులు నిచ్చింతగా ఉండొచ్చన్నారు. హిందీ చదవడం, రాయడం నేర్చుకున్న విద్యార్థులు దేశంలో ఎక్కడైనా రాణించగలరన్నారు. తాను పార్లమెంటరీ విద్యా సలహా కమిటీ సభ్యురాలుగా ఉన్నానని, ఈ అవకాశం ఉపయోగించుకొని రాష్ట్రానికి, నంద్యాల జిల్లాకు కేంద్ర ప్రభుత్వం ద్వారా విద్యకు ఎక్కువ నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానన్నారు.

డోన్ కేంద్రీయ విద్యాలయం లో చదువుకునే విద్యార్థులు (students) చదువుతో పాటు అన్ని రంగాల్లో రానించాలని, ఏ అవసరం వచ్చినా తనకు ఫోన్ చేసి సమస్య పరిష్కరించుకోవాలని, విద్యార్థులందరూ ఉన్నత శిఖరాలు చేరుకోవాల‌న్నారు. ఈ కార్యక్రమంలో డోన్ ఆర్డిఓ కె.పి. నరసింహులు, డోన్ అర్బన్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఇర్ఫాన్, అధ్యాపకులు పాల్గొన్నారు.

Leave a Reply