సన్న బియ్యంతో పేదల ఆకలి తీరుస్తున్న ప్రభుత్వం

సన్న బియ్యంతో పేదల ఆకలి తీరుస్తున్న ప్రభుత్వం

ఊట్కూర్, ఆంధ్రప్రభ : దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy) రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేసి పేద ప్రజల ఆకలి తీరుస్తున్నారని ఊట్కూర్ సింగిల్ విండో అధ్యక్షులు బాల్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు డి. యజ్ఞేశ్వర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసిలు సూర్య ప్రకాశ్ రెడ్డి, మణెమ్మ అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని శ్రీరాంనగర్ రేషన్ దుకాణం వద్ద సన్న బియ్యం బ్యాగులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక కృషి చేస్తుందని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు, గృహ జ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్, వడ్డీ లేని రుణాలు, పేదల ఆరోగ్య పరిరక్షణకు ఆరోగ్యశ్రీ పథకం, సీఎం సహాయనిధి, రైతు బంధు, రైతు భరోసా వంటి పథకాలు ప్రవేశ పెడుతున్నారన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక చొరవతో నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా సాగునీరు తీసుకువచ్చి బీడు భూములను సాగు యోగ్యం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.

అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమ న్యాయం చేస్తున్నారని ప్రజలు ఉచితంగా పంపిణీ చేస్తున్న సన్న బియ్యం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో నారాయణపేట – మక్తల్ ఆర్ అండ్ బి రహదారి నాలుగు వరుసల పనులు త్వరలో ప్రారంభిస్తారని అన్నారు. పల్లె సీమల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కోరం మహేష్ రెడ్డి, మైనార్టీ మండల అధ్యక్షులు జలాల్, పట్టణ అధ్యక్షులు కొక్కులింగం, నాయకులు కార్యకర్తలు అబ్దుల్ రెహమాన్, శివరామరాజు, గోపాల్ రెడ్డి, మమ్మద్ కుర్షిద్, కుర్వ వెంకటేష్, దాసరి మధు, అశోక్, రవి, రాఘవేందర్ గౌడ్, జమీర్,యజ్ఞ దత్తు, ఎరుకలి నరేష్, అర్ఫత్, రామకృష్ణ, బాలప్ప, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply