Football | క్రీడ‌ల‌కు ప్ర‌భుత్వ ప్రోత్సాహం

క్రీడ‌ల‌కు ప్ర‌భుత్వ ప్రోత్సాహం

  • రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ పోటీలు షురూ
  • మైలవరంలో ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురాం..

Football | ఆంధ్రప్రభ, మైలవరం : మైలవరంలోని లకిరెడ్డి హనిమిరెడ్డి క్రీడాప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ ఫుట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ పోటీలను స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌, కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురాం సోమవారం ప్రారంభించారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తూ ఎన్నో చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇక్కడ రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ఫుట్ బాల్ క్రీడా కారులను అభినందించారు. విద్యాదాత లకిరెడ్డి హనిమిరెడ్డి, లకిరెడ్డి జయప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply