జార్ఖండ్ : జార్ఖండ్ (Jharkhand) రాష్ట్రంలోని సెరైకేలా-ఖర్సవాన్ జిల్లాలోని చండిల్ (Chandle) సమీపంలో శనివారం తెల్లవారుజామున ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలులోని 20కిపైగా బోగీలు పట్టాలు తప్పినట్లు సమాచారం. దాంతో ఆగ్నేయ రైల్వేలోని చండిల్-టాటానగర్ (Chandil-Tatanagar) సెక్షన్ మధ్య రైలు సేవలు నిలిచిపోయాయి.
ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఒక అధికారి తెలిపారు. సమాచారం ప్రకారం, ఐరన్ లోడ్‌తో వెళ్తున్న గూడ్స్ రైలు (Goods train) టాటానగర్ నుంచి పురులియాకు వెళుతోంది. చండిల్ స్టేషన్ దాటిన తర్వాత గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. రైలు బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై వచ్చాయి.
ఎదురుగా వస్తున్న మరో గూడ్స్ రైలు కోచ్‌లను ఢీకొట్టాయి. మరొక గూడ్స్ రైలులోని అనేక కోచ్‌లు కూడా పట్టాలు తప్పాయి. ప్రమాదానికి కారణం రైల్వే దీనిపై దర్యాప్తు ప్రారంభించింది (Investigation started). సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ (ఆద్రా డివిజన్) వికాస్ కుమార్ మాట్లాడుతూ.. ప్రమాదం కారణంగా చండిల్ నుంచి అప్ డౌన్ ట్రాక్‌లో రైలు సేవలు ప్రభావితమయ్యాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం మరమ్మతు పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఎక్స్‌ప్రెస్ (Express), మెయిల్ రైళ్లన్నీ మళ్లించినట్లు పేర్కొన్నారు. చాలా వరకు రద్దు చేశామన్నారు. పాట్నా-టాటానగర్ (20894) వందే భారత్ ఎక్స్‌ప్రెస్, టాటానగర్-కతిహార్ (28181) ఎక్స్‌ప్రెస్, కతిహార్-టాటానగర్ ఎక్స్‌ప్రెస్‌లను (28182) రద్దు చేసినట్లు అధికారి తెలిపారు.