ప్రముఖ ఈ కామర్స్ ఫ్లాట్ పామ్ ప్లిప్ కార్ట్ ఇండిపెండెన్స్ డే సేల్ 2025 ను ప్రారంభించింది. ఆగస్టు 13న ప్రారంభమైన ఈ సేల్ ప్రస్తుతం కొనసాగుతుండగా, వినియోగదారులు విభిన్న ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను ఆస్వాదిస్తున్నారు.
ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, వేర్‌బుల్స్, ల్యాప్‌టాప్‌లు, హోమ్ అప్లయెన్సులు వంటి విభిన్న విభాగాల ఉత్పత్తులు ఆకర్షణీయమైన ధరలకు అందుబాటులో ఉన్నాయి. యాపిల్, సామ్‌సంగ్, మోటరోలా, నథింగ్, ఒప్పో, వివో వంటి ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులు తక్కువ ధరలకు కొనుగోలు చేసే అవకాశం లభిస్తోంది.
ముందుగానే ప్రకటించిన ఆఫర్లు !
సేల్ ప్రారంభానికి ముందే ఫ్లిప్‌కార్ట్ కొన్ని స్మార్ట్‌ఫోన్ ఆఫర్లను వెల్లడించింది. ఒప్పో K13 5G (MRP ₹17,999) ఇప్పుడు ₹15,999కి, ఒప్పో K13x 5G ₹11,999 నుంచి ₹10,999కి అందుబాటులోకి వస్తున్నాయి.
ఈ సేల్‌లో ఆఫర్లు, డిస్కౌంట్‌తో లభించే ఫోన్లు:
- iPhone 16
- Motorola Edge 60 Fusion
- Samsung Galaxy S24 FE
- Samsung Galaxy S24
- Vivo T4 5G
- Realme P3 5G
- Nothing Phone 2 Pro
- Realme P3x 5G
- Motorola G45
- Vivo T4x 5G
- Samsung Galaxy A35 5G
- Nothing Phone 3a Pro
‘ఇండిపెండెన్స్ డే సేల్’లో iPhone 16 ₹79,900 నుంచి ₹69,999కి, Motorola Edge 60 Fusion ₹20,999కి, Samsung Galaxy S24 మరియు S24 FE రెండూ ₹46,999కి లభించాయి.
అదనపు బ్యాంక్ డిస్కౌంట్
కెనరా బ్యాంక్ తో భాగస్వామ్యంలో ఫ్లిప్‌కార్ట్ 10% తక్షణ తగ్గింపు అందిస్తోంది. ఈ ఆఫర్‌ను పొందడానికి ముందు నిబంధనలు తప్పనిసరిగా పరిశీలించాల్సిందిగా సూచిస్తోంది.
ప్రీమియం మోడల్స్ పై భారీ తగ్గింపులు, మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్లపై ఆకర్షణీయమైన ఆఫర్లతో, ఫ్లిప్‌కార్ట్ ఇండిపెండెన్స్ డే సేల్ 2025 టెక్ ప్రియులకు మిస్ చేయరాని అవకాశంగా మారనుంది.