జీసస్ త్యాగానికి ప్రతీక గుడ్ ఫ్రై డే

కొత్తూరు, ఆంధ్రప్రభ : జీసస్ మహాత్యాగానికి ప్రతీక గుడ్ ఫ్రైడే అని కొత్తూరు మాజీ వార్డు సభ్యుడు అల్విన్ రెడ్డి అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని ఫాతిమాపూర్ గ్రామంలో శుక్రవారం ఫాతిమామాత చర్చిలో చర్చి ఫాదర్ సమక్షంలో భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం భక్తులు సిలను భుజంపై పెట్టుకుని గ్రామంలోని వీధి వీధిన ఊరేగించారు.

ఈ సందర్భంగా ఏసుక్రీస్తు చేసిన ప్రాణ త్యాగాన్ని, ఏసు పడిన బాధలను స్మరించుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు దిలీప్ రెడ్డి, క్రైస్తవులు లూర్దు రెడ్డి, ఆరోగ్య రెడ్డి, మర్రెడ్డి, యాగారెడ్డి, సుధాకర్ రెడ్డి, జోసెఫ్ రెడ్డి, సాంసన్ రెడ్డి, బాల్రెడ్డి, ఇన్నారెడ్డి, ప్రతాపరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply