భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే ప్రార్థనలు…

జూలూరుపాడు, ఆంధ్రప్రభ ; యేసు క్రీస్తు సిలువ మరణాన్ని స్మరించుకుంటూ గుడ్ ఫ్రైడే (మంచి శుక్రవారం)ను పురస్కరించుకుని క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు జరుపుకున్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు,శిలువ మార్గమును నిర్వహించారు.రోమన్ క్యాథలిక్ చర్చి (అర్సిఎం)ఫాదర్ లూర్డ్ కిరణ్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై క్రీస్తుపై విశ్వాసం కలిగిన భక్తులు శిలువను భుజంపై ఎత్తుకుని ముందుకు నడిచారు.

పద్నాలుగు స్థలాలను ఏర్పరుచుకుని ఒక్కొక్క స్థలం వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో క్రీస్తు ప్రభువు ప్రపంచ మానవాళి పాప పరిహారం కోసం శిలువపై రక్తం చిందించి మరణించారని గుర్తు చేసుకున్నారు. క్రీస్తు బోధనలు అనుసరణీయమని, త్యాగం, ప్రేమ, సోదరభావంతో ప్రజలు ఐక్యతతో జీవించాలని ప్రబోధించారని సువార్తీకులు ప్రార్థనల్లో పేర్కొన్నారు.ఈస్టర్ పండుగకు ముందుగా వచ్చే శుక్రవారంను గుడ్ ఫ్రైడే (మంచి శుక్రవారం) క్రైస్తవులల విశ్వాసం. ఈ కార్యక్రమంలో రోమన్ క్యాథలిక్ మిషన్ కు సంబంధించిన సిస్టర్స్, విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply