నిరుద్యోగులకు సువర్ణావకాశం…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మరోసారి ముందుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా యువతకు శాశ్వత, తాత్కాలిక, అప్రెంటిస్‌షిప్ ఉద్యోగాలు అందించాలనే లక్ష్యంతో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తోంది.
ఈ నెల (అక్టోబర్) 23వ తేదీర అనకాపల్లి జిల్లా, కోటవురట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు.
ఈ జాబ్ మేళాలో మొత్తం 18 ప్రముఖ ప్రైవేట్ కంపెనీలు పాల్గొననున్నట్లు అధికారులు వెల్లడించారు. టెక్నికల్, ప్రొడక్షన్, సేల్స్, కస్టమర్ సపోర్ట్, సూపర్వైజర్ వంటి విభాగాల్లో నియామకాలు చేపట్టనున్నారని తెలిపారు.
అలాగే, 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు ఈ మేళాకు హాజరుకావచ్చని అధికారులు పేర్కొన్నారు. 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ లేదా పీజీ పూర్తిచేసిన వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని సూచించారు.
ముఖ్య సూచనలు..
- అభ్యర్థులు తమ ఒరిజినల్ విద్యార్హత సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలు మరియు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావాలి.
- పాల్గొనదలచిన వారు ముందుగా APSSDC అధికారిక వెబ్‌సైట్ https://naipunyam.ap.gov.in/ ద్వారా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.